calender_icon.png 24 October, 2025 | 3:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ లో ఎగిరేది గులాబీ జెండానే

23-10-2025 11:02:24 PM

యువ నాయకులు మాణిక్ యాదవ్..

అమీన్ పూర్: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు ఐలాపూర్ మాణిక్ యాదవ్ విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఎగరేది గులాబీ జెండానే అని తెలిపారు. ప్రజల్లో పార్టీ పట్ల విశేషమైన ఉత్సాహం నెలకొని, ప్రచారం విజయవంతంగా కొనసాగుతుందన్నారు. బిఆర్ఎస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, తెల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ సోమిరెడ్డి, మీరాజ్ ఖాన్, దేవేందర్ యాదవ్, మహేష్, నాయకులు పాల్గొన్నారు.