24-10-2025 12:12:24 AM
మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి
27 నుంచి నవంబర్ 5 వరకు రిలే నిరాహార దీక్షలు
తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ
ముషీరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): బీసీలకు రాజ్యాధికారం ద్వారానే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ రాష్ట్ర మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొం డ మధుసూదనా చారి అన్నారు. 42 శాతం రిజర్వేషన్ల అమలుకై కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు పాలకవర్గాలు కృషి చేయాల న్నారు. గురువారం బషీరాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన ఉద్య మ కార్యచరణపై రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మె ల్సీ మధుసూదనాచారి మాట్లాడుతూ 42 శాతం బీసీల రిజర్వేషన్లపై పాలకవర్గాలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ మాట్లాడు తూ 42 శాతం రిజర్వేషన్ల అమలుకై ఈనెల 27 నుంచి నవంబర్ 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రాలలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ముందుగా 27న ఇందిరా పార్కు ధర్నా చౌక్‌చలో పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షతో ప్రారంభమవుతాయని చెప్పారు.