24-10-2025 12:12:35 AM
న్యూఢిల్లీ, అక్టోబర్ 23: ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ ఈ నెల 23న పదవీ విరమణ చేయనుండటంతో ప్రభుత్వం గురువారం తదుపరి సీజే ఐ నియామకం కోసం ప్రక్రియ ప్రారంభించింది. వారసుణ్ని సూచించాల్సిందిగా జస్టిస్ గవాయ్‌కి ప్రభుత్వం లేఖ రాయనుంది. సం ప్రదాయం ప్రకారం జడ్జీల నియామకాలు, బదిలీలు, పదోన్నతులను భారత చీఫ్ జస్టిస్ ఆమోదించాల్సి ఉంటుంది.
భారత ప్రధాన న్యాయమూర్తి 65 ఏళ్లకు రిటైర్ అవుతారు. ఆయన స్థానంలో కొత్తవారిని నియమించేందుకు ఒక నెల ముందు నుంచే ప్రక్రియ మొ దలవుతుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో సీజే ఐ తర్వాత సీనియర్ జడ్జిగా జస్టిస్ సూర్యకాంత్ ఉన్నారు. సీజేఐ ఆమోదిస్తే జస్టిస్ సూర్యకాంత్ నవంబర్ 24న బాధ్యతలు చేపడతారు. ఆయన దాదాపు 15 నెలల పాటు.. 2027 ఫిబ్రవరి 9 వరకు సీజేఐగా ఉంటారు.