24-10-2025 12:12:42 AM
దౌల్తాబాద్, అక్టోబర్ 23: సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని మాచిన్పల్లి, దీపాయంపల్లి, దొమ్మాట, గాజులపల్లి గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, పాక్స్ చైర్మన్ అన్నారెడ్డిగారి వెంకట్ రెడ్డిలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ రైతుల కష్టానికి తగిన న్యాయమైన ధర లభించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతులు మధ్యవర్తుల జోక్యం లేకుండా నేరుగా కేంద్రాల ద్వారా తమ వడ్లను అమ్మాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య మాట్లాడుతూ రైతు సంక్షేమం ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు అన్ని విధాల సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ చంద్రశేఖర్ రావు, ఇంచార్జ్ ఎంపీడీవో సయ్యద్ గఫూర్ ఖాద్రీ, మండల వ్యవసాయాధికారి సాయికిరణ్, ఆత్మ కమిటీ డైరెక్టర్లు సూరంపల్లి ప్రవీణ్, వేమ కనకరాజు, పాక్స్ డైరెక్టర్లు బుడ్డ రమేష్, చిక్కుడు సత్యనారాయణ, పాక్స్ కార్యదర్శి మల్లేశం, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పడాల రాములు, బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు సయ్యద్ రహీమొద్దీన్, రణం శ్రీనివాస్ గౌడ్, బండారు లాలు, కొమ్మెర వెంకట్ రెడ్డి, అప్పవారి శ్రీనివాస్, మల్లారెడ్డి పంజ స్వామి, బోర్రోళ్ళ స్వామి, నారెడ్డి యాదవ రెడ్డి తదితరులున్నారు.