09-07-2025 12:48:06 AM
పార్థివ దేహం కొత్తగూడెం మెడికల్ కాలేజీకి అందజేత
బూర్గంపాడు,జూలై 8(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామంలో ప్రముఖ విద్యావేత్త ప్రగతి విద్యానికేతన్ కరస్పాండెంట్ ఏజెన్సీ విద్య ప్రబుద్ధుడు సానికొమ్ము బ్రహ్మారెడ్డి గత రెండు సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం తుది శ్వాస విడిచారు.వారి కోరిక మేరకు కళ్ళను ఖమ్మం ఐ బ్యాంక్ వాళ్లకు అందజేసినట్లు సానికొమ్ము బ్రహ్మారెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి తెలిపారు.
ఈ సందర్భంగా చైతన్య రెడ్డి మాట్లాడుతూ తన తండ్రి బ్రహ్మారెడ్డి ఏజెన్సీ ప్రాంతంలో గత 40 సంవత్సరాలుగా విద్య సేవలో ఉండి ఎందరో మేధావులను అందించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. బ్రతికినన్ని రోజులు విద్య కోసమే తాపత్రయపడ్డ తాను మరణాంతరం కూడా తమ కుటుంబ సభ్యులకి ఇష్టం లేకపోయినా కనీస స్వయంగా అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో తన పార్ధీవ దేహం విద్యార్థులకు ఉపయోగపడే విధంగా మెడికల్ కాలేజీకి అందించాలని ఒప్పించుకున్నాడని తెలిపారు.
ఆయన కోరిక మేరకు తన తండ్రి పార్ధీవ దేహాన్ని కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు ఇస్తున్నట్లు ప్రకటించారు. తాను మరణిస్తే తన దేహాన్ని మట్టిలో పూడిస్తే ఒకరోజు తోటి అయిపోద్ది కానీ తన పార్ధీవ దేహాన్ని విద్యార్థులకు అందిస్తే మెడికల్ విద్యార్థులకు ఒకరోజు పాఠ్యాంశంగా మిగిలిపోతుందని, అందుకోసమే తన త్యాగాన్ని ,తన నిర్ణయాన్ని వద్దన లేకపోయామని అన్నారు. తన తండ్రి కడుపులో పుట్టినందుకు చాలా గౌరవంగా ఉందని అన్నారు. విద్య కోసమే బ్రతికాడు విద్య కోసమే మరణిస్తున్నాడని తెలిపారు.ఈ కార్యక్రమంలో వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.