09-07-2025 12:46:06 AM
జనగామ (మహబూబాబాద్) జూలై 8 (విజయక్రాంతి): జనగా మ జిల్లాలో మం గళవారం ఇద్దరి భార్యల చేతిలో భర్త అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జనగామ జిల్లా లింగాల ఘనపురం మండలం ఏనె బావి శివారు పిట్టలోని గూడెంలో చోటు చేసుకుంది. కాల్య కనకయ్య(30) అనే వ్యక్తికి శిరీష, గౌరమ్మ ఇద్దరు భార్యలు. మద్యానికి బానిసైన కనకయ్య తరచూ తాగొచ్చి భార్యలతో గొడవ పడుతుండేవాడు.
ఈ క్రమంలో మే 18వ తేదీన పూటుగా తాగొచ్చి తన సొంత అక్కను హత్య చేసి అక్కడ నుంచి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు కనకయ్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కనకయ్య అప్పుడప్పుడు గ్రామానికి వస్తూ ఇద్దరు భార్యలను, గ్రామస్థులను బెదిరిస్తూ ఉండేవాడు.
ఈ క్రమంలోనే సోమవారం రాత్రి మరోసారి ఇంటికి చేరుకుని భార్యలను బెదిరించాడు. చేతిలో గొడ్డలి పట్టుకుని వారితో గొడవ పెట్టుకున్నాడు. దీంతో ఆ ఇద్దరు అతడిపై ఎదురుతిరిగి అదే గొడ్డలితో నరి కి హత్యచేశారు. పోలీసులు నిందితులన అదుపులోకి తీసుకున్నారు.