calender_icon.png 26 September, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన ప్రసంశ

26-09-2025 01:07:17 AM

సూర్యాపేట సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : జాతీయ స్థాయి అథ్లెటిక్స్ లో రెండు మెడల్స్ సాధించి తన సత్తాను చాటింది జిల్లా కేంద్రానికి చెందిన చిత్తలూరి ప్రసంశ. ఈనెల 23 నుండి 25 వరకు నాగార్జున యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్  లో జరిగిన 36వ సౌత్ జోన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ -2025లో పెంటాత్లన్ ఈవెంట్ లో రజత, 60 మీటర్ల పరుగు పందెంలో కాంస్య పథకాలు సాధించింది.

స్థానిక సాయి గౌతమి కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. సూర్యాపేట అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ గడ్డం వెంకటేశ్వర్లు, తూము హనుమంతరావు, చెరుకు వెంకటేష్ సూచనల మేరకు ఖాళీ సమయంలో నాగపూరి రమేష్ (ద్రోణచార్య అవార్డి), సాజీ, నాగరాజ్, రవీంధర్, రామ్, లక్ష్మణ్ ల వద్ధ శిక్షణ తీసుకుంటూ జాతీయ స్థాయిలో మెడల్స్ సాదించిది.

ప్రసంశ తల్లి సునీత పెన్ పహాడ్ మండలంలోని నాగులపహాడ్ అన్నారం జడ్పీహెచ్‌ఎస్ లో పీడీగా విధులు నిర్వహిస్తుంది. జాతీయస్థాయిలో రెండు పథకాలు సాధించినందుకు ప్రసంశను పలువురు అభినందిస్తున్నారు.