02-01-2026 12:39:57 AM
మేడ్చల్ అర్బన్, జనవరి 1 (విజయక్రాంతి): పూడూర్-కిష్టాపూర్ డివిజన్ పరిధి పూడూర్ గ్రామానికి చెందిన నిమ్మల ప్రశాంత్ కుమార్ కు తెలంగాణ రాష్ట్ర వాలీబాల్ జట్టు అసిస్టెంట్ కోచ్ స్థానం లభించింది. కిష్టాపూర్ లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ప్రశాంతకుమార్ ను 72వ సీనియర్ నేషనల్ వాలీబాల్ ఛాంపియన్ షిప్ లో పాల్గొనే పురుషులు, మహిళల జట్టుకు అసిస్టెంట్ కోచ్ గా నియమిస్తూ తెలంగాణ వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ బాబు, ప్రధాన కార్యదర్శి హన్మంత్ రెడ్డి ఉత్వర్వులు జారీ చేశారు.
ఈ నెల 4వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో జరిగే ఛాంపియన్ షిప్ పోటీలో రాష్ట్ర వాలీబాల్ జట్టుకు తన సేవలు అందించనున్నాడు. నేషనల్ వాలీబాల్ జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా నియామక మైన ప్రశాంత్ కుమార్ ను మల్లారెడ్డి కళాశాల చైర్మెన్ మల్లారెడ్డి, యాజమాన్యం, పూడూర్ గ్రామస్తులు అభినందించారు.