02-01-2026 12:40:49 AM
హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): కృష్ణ, గోదావరి నది జలాలు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై అసెంబ్లీలో పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ (పీపీపీ) ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్‌ఎస్ చేస్తున్న విమర్శలను అసెంబ్లీలోనే తిప్పికొట్టేందుకు సన్న ద్ధం అవుతుంది. సభలో ప్రజెంటేషన్ ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని శుక్రవారం ప్రభు త్వ పెద్దలు స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేయనున్నారు.
స్పీకర్ సమయం ఇచ్చిందాన్ని బట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వాస్తవాలను వివరించాలని సర్కార్ భావిస్తుంది. అసెంబ్లీలో సాగునీటి ప్రాజె క్టులపై ప్రజెంటేషన్ శనివారం ఉండే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నా యి. శుక్రవారం అసెంబ్లీ ప్రారంభం కాగానే సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పనున్నారు.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంపై స్వల్పకాలిక చర్చ, పురపాలక, జీహెచ్‌ఎంసీ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, మోటారు వాహనాల పన్ను చట్ట సవరణల బిల్లులపై చర్చ జరగనున్నది. అసెంబ్లీలో ఆమోదం అనంతరం మండలిలో బిల్లులపై చర్చ చేపట్టనున్నారు. బీఏసీ నిర్ణయాలను సీఎం రేవంత్‌రెడ్డి ఉభయ సభల్లో పెట్టనున్నారు.