calender_icon.png 18 November, 2025 | 5:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముందు జాగ్రత్త చర్యలు అవసరం

18-11-2025 12:04:08 AM

రాష్ట్రంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు, మరణాలు సంభవించని రోజు లేదు. దీనికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడపడం, స్టీరింగ్ ముందు కూర్చొని సెల్‌ఫోన్లు చూస్తూ, మాట్లాడడం, నిద్ర మత్తులో నడపడం, పరిమితికి మించి వేగం పెంచడం, సడెన్ బ్రేకులు వేయడం ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అంతేకాదు వాహనాలు నడిపిన అనుభవం లేకుండానే రోడ్లపైకి తీసుకురావడం, లైసెన్స్‌లు లేని చోదకులు, నియమ నిబంధనలు పాటించని వాహనాలు పెరిగిపోయాయి.

కాలం చెల్లిన వాహనాలు రోడ్లపై ఎక్కువగా ఉండడం, వాటికి అనుమతినిస్తున్న అధికారుల నిర్లక్ష్యం ఇవన్నీ కారణాలే. ముఖ్యం గా ప్రభుత్వ, ప్రైవేటు బస్సులన్నింటిలోనూ ఈ లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మొన్న కర్నూల్ బస్సు ప్రమాదం చూసుకున్నా, నిన్న చేవేళ్ల మండలం మీర్జాగూడ బస్సు ప్రమాదం.. ఇవాళ సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదం ఇలా ఏదైనా డ్రైవర్ల నిర్లక్ష్యం కూడా స్పష్టంగా కనిపిస్తున్నది. అధికారులు కూడా సమగ్ర పరిశీలనలు చేయకుండానే అడ్డగోలు పర్మిట్లు, పర్మిషన్‌లు ఇవ్వడం కూడా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తక్షణమే ప్రభుత్వాలు అధికారులపై చర్యలు తీసుకోవాలి.

 రామలక్ష్మి, హైదరాబాద్