28-01-2026 12:00:00 AM
తాడ్వాయి, జనవరి, 27( విజయ క్రాంతి ): రాబోయే వేసవి కాలంలో తాగునీటి సమస్యలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తాడ్వాయి ఎంపీ ఓ సవిత రెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్ లకు, కార్యదర్శులకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... రానున్న వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, పైపులైన్ల లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించాలన్నారు. బోరు బావుల సమస్యలు ఉంటే బోరు బావులు బాగు చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు