30-09-2024 12:00:00 AM
మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా చాలామంది ఆర్థోపెడిక్ సమస్యతో బాధపడుతున్నారు. దీనికితోడు బోలు ఎముకల వ్యాధి కూడా బాధిస్తోంది. అయితే వయస్సు పెరిగేకొద్దీ ఎముకలు, కీళ్లు నొప్పులు ఎక్కువవుతుంటాయి. అయితే జీనవశైలిలో చిన్నచిన్నజాగ్రత్తలు తీసుకుంటే కీళ్ల నొప్పులకు చెక్ పెట్టొచ్చు అని చెబుతున్నారు నిపుణులు.
-కొన్ని జాగ్రత్తలు
1. ఎట్టి పరిస్థితుల్లోనూ కుర్చీ లేదా స్టూల్ మీద నిలబడొద్దు.
2. వర్షాకాలంలో బయటకు వెళ్లొద్దు.
3. స్నానం చేసేటప్పుడు లేదా టాయిలెట్ ఉపయోగించేటప్పుడు అలెర్ట్‌గా ఉండాలి.
4. బాత్రూమ్‌లో దుస్తులు మార్చుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. స్నానం చేసిన తర్వాత పడకగదిలోనే హాయిగా బట్టలు ధరించండి.
5. టాయిలెట్ కు వెళ్లేటప్పుడు బాత్రూమ్ ఫ్లోర్ తడిగా లేకుండా చూసుకోండి. కమోడ్ మాత్రమే వాడండి.. అదే సమయంలో కమోడ్ సీటు నుండి లేచేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.
6. పడుకునేముందు బెడ్‌ను శుభ్రంగా ఉంచుకోవాలి. నేల తడిగా ఉన్నప్పుడు రెట్టింపు జాగ్రత్తలు పాటించాలి.
7. అర్ధరాత్రి నిద్రలేవగానే రెండు నిమిషాల తర్వాతనే బెడ్ దిగాలి. ముందుగా లైట్ ఆన్ చేసి ఆ తర్వాతనే అడుగులు వేయండి.
8. టాయిలెట్ తలుపును లోపలి నుంచి మూసివేయొద్దు.
9. అత్యవసర పరిస్థితుల్లో కుటుంబసభ్యుల సహాయం తీసుకోండి.
10. ప్రమాదవశాత్తు కిందపడిపోయినప్పుడు వెంటనే లేవకుండా చేతులు నేలపై చాపి మెల్లగా పైకి లేవడానికి ప్రయత్నించాలి.
11. సాధ్యమైనంత వరకు వ్యాయామం చేయండి.
12. డైట్ కంట్రోల్ చాలా ముఖ్యం. శుభ్రమైన ఆహారం తీసుకోవడం. రెండుపూటల స్నానం చేయడం మరవద్దు.
ఇలా చేద్దాం
ఎముకల బలానికి మందులు వాడేకంటే పాల ఉత్పత్తులు, సోయా, సీఫుడ్, కాల్షియం అధికంగా ఉండే చిన్న రొయ్యలు తినాలి. విటమిన్ డి కోసం సూర్యరశ్మిని తీసుకోండి. మెట్లు ఎక్కేటప్పుడు హ్యాండ్ రైల్స్ వాడాలి. శరీరంలో ఏదైనా ఎముక కదిలితే నయం కావడానికి కొన్ని సంవత్సరాలు పడుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ సేపు నిలబడటం మానుకోవాలి.