calender_icon.png 19 September, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వికసిత్ భారత్ ద్వారా భారతదేశాన్ని ఆగ్రగామిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న నరేంద్ర మోదీ

19-09-2025 12:00:00 AM

ఎమ్మెల్సీ మల్కా కొమురయ్య 

సుల్తానాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): వికాసితు భారత్ ద్వారా భారతదేశాన్ని అగ్రగామిగా నిలబట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్నారని టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య అన్నారు, సేవా పక్వాడ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా సుల్తానాబాద్ పట్టణంలోని స్థానిక ఇండియన్ పబ్లిక్ పాఠశాలలోని విద్యార్థులకు బీజేపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో చిత్రలేఖనం పోటీలు గురువారం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా టీచర్స్ ఎమ్మెల్సీ మల్క కొమురయ్య హాజరై,ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నరేంద్ర మోడీ వికసిత్ భారత్ కార్యక్రమం ద్వారా 2047 నాటికి, భారతదేశాన్ని అగ్రగామిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, మోడీ నాయకత్వంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం నాలుగో స్థానంలో నిలిచిందని తెలిపారు.

కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్, ప్రిన్సిపల్ కృష్ణప్రియ,బిజెపి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి అశోక్ రావు, జిల్లా సేవే పక్వాడ అభియాన్ కన్వీనర్ నల్ల మనోహర్ రెడ్డి, కో కన్వీనర్ మిట్టపల్లి ప్రవీణ్ కుమార్, మహిళా మోర్చా కన్వీనర్ నిర్మల, జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్, రమేష్, జిల్లా కోశాధికారి రాజేంద్రప్రసాద్,బిజెపి నాయకులు కొమ్ము తిరుపతి, పవన్, సతీష్, శ్రీనివాస్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.