calender_icon.png 22 November, 2025 | 2:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ ఎన్నికలకు కసరత్తు

22-11-2025 01:35:18 AM

  1. ఈ నెల 24 లేదా 25న షెడ్యూల్ విడుదల?
  2. రేపు, ఎల్లుండి రిజర్వేషన్లు ఖరారు  

హైదరాబాద్, నవంబర్ 21 (విజయ్ర కాంతి) : పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌కు  రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎన్‌ఈసీ), ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేస్తున్నాయి. అందులో భాగంగా  గ్రామ పంచాయతీలు, వా ర్డుల రిజర్వేషన్ల విధి విధానాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ పంచాయ తీరాజ్ శాఖ శనివారం జీవో విడుదల చేయనుంది.   50శాతం మించకుండా కొత్త రిజర్వేషన్లను సిఫార్సు చేస్తూ డెడికేటెడ్ కమిషన్ ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే.

డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులను సర్క్యులేషన్ విధా నంలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించ నుంది. మంత్రుల వద్దకు ఫైలు పంపించి ఆమోదిస్తున్నట్లు సంతకాలు తీసుకున్నారు. పంచాయతీలు, వార్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లపై పంచాయతీరాజ్ శాఖ జారీ చేయనున్న జీవోకు అనుగుణంగా ఎంపీడీవోలు వార్డులకు, ఆర్డీవోలు సర్పంచ్ పదవులకు రిజర్వేషన్లు ఖరారు చేస్తారు. రాజకీయ పార్టీల సమక్షంలో లాటరీ పద్ధతిలో మహిళలకు సీట్లు కేటాయించ నున్నారు.

శని,ఆదివారం జిల్లాల యంత్రాం గం రిజర్వేషన్లు పూర్తి చేయనుంది. రిజర్వేష న్లను ఖరారు చేసిన తర్వాత పంచాయతీ ఎన్నికలకు సంసిద్ధ్దత వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ రాయ నుంది. ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్నామని, పిటిషన్‌పై విచారణ ముగించాలని ఈ నెల 24న హైకోర్టుకు ప్రభుత్వం, ఎస్‌ఈసీ తెలపనున్నాయి. హైకోర్టు అంగీకరిస్తే అదే రోజు లేదా మరుసటి రోజు షెడ్యూల్ విడు దల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.