22-11-2025 02:01:32 AM
నిర్మల్, నవంబర్ 21 (విజయక్రాంతి): జిల్లాలోని అన్ని గ్రామాలలో పారిశుధ్య పనులను నిర్వహించి ప్రజల ఆరోగ్యాన్ని కాపా డాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నా రు. జిల్లా పంచాయతీ శాఖ ఆధ్వర్యంలో 18 మండలాలకు పాగింగ్ మిషన్ శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో పంపిణీ చేశారు. దోమల నివారణకు ఈ మిషన్లను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది ప్రజలతో మమేకమై ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ డిపిఓ శ్రీనివాస్ డిఆర్డిఓ విజయలక్ష్మి జెడ్పి సీఈవో గోవిందు అధికారులు ఉన్నారు