22-11-2025 02:02:47 AM
-చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
-ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్, నవంబర్ 21 (విజయక్రాం తి): ప్రజా రక్షణ, శాంతి భద్రతల కోసం 24 గంటలు కృషి చేస్తున్న పోలీసు సిబ్బందికి క్రమశిక్షణ సమయపాలనతో పాటు, నీతి నిజాయితీలు తప్పనిసరిగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. పోలీసు వ్యవస్థ కీర్తి ప్రతిష్టలను పెంచే విధంగా విధు లు నిర్వర్తించాలని సూచించారు. వార్షిక తనిఖీలలో భాగంగా ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ శుక్రవారం పరిశీలించారు.
ముందుగా పోలీస్ స్టేషన్ ఆవరణను పరిశీలించి పరిశుభ్రతపై దృష్టి సారించాలని, పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలను నాటుతూ పచ్చదనాన్ని పెంపొందించాలని సూచించారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను పరిశీలించి వాటి స్థితిగ తులను కేసు పరిస్థితిలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్‌లోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడుతూ 24 గంటలు పనిచేసే వ్యవస్థలలో పోలీసు వ్యవస్థ కీలకమైనదని ప్రజల ధన,మాన, ప్రాణ రక్షణ బాధ్యతలను పోలీసు వ్యవస్థ చేపడుతుందని, దానిని సక్రమంగా నిర్వర్తించినప్పుడు పోలీసు కీర్తి ప్రతిష్టలు సమాజం లో ఉన్నత స్థాయికి చేరుతాయని తెలిపారు.
మండల పరిధిలో ఎలాంటి ఆసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పర్యవేక్షించాలని, గ్రామాలను సందర్శిస్తూ వారికి సైబర్ క్రైమ్, రోడ్ సేఫ్టీ క్లబ్, పోలీసు అక్క, మహిళల భద్రత, షీ టీం, ముఖ్యంగా మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని అవగాహన కల్పించాలన్నారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్ వ్యవస్థ పూర్తి సమాచార సేకరణ చేపట్టి ప్రజలలో మమేకం కావాలన్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపట్ల, రౌడీయి జం, గుండాయిజం చేసేవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తూ ఉండాలని తెలిపారు.
విధుల నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి నగదు రివార్డులను ప్రశంస పత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్‌రెడ్డి, రూరల్ సీఐ ఫణిదర్, ఎస్‌ఐ విష్ణువర్ధన్, సిబ్బంది పాల్గొన్నారు.