12-05-2025 02:24:05 AM
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ
కీవ్, మే 11: రష్యా అధినేత పుతిన్‌తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. ఆదివారం ఆయన మీడి యాతో మాట్లాడుతూ.. ‘ఎట్టకేలకు రష్యా యుద్ధం ముగించే విషయాన్ని పరిశీలిస్తోంది. చాలా రోజుల నుంచి ఇందుకోసమే ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. యుద్ధం ముగింపులో మొదటి అడుగు కాల్పుల విరమణే..ఈ మారణకాండను ఒక్కరోజు కూడా కొనసాగించడంలో అర్థం లేదు..’అని పేర్కొన్నారు.
రష్యా కాల్పుల విరమణ ధ్రువీకరణ కోసం ఎదురుచూస్తున్నామని, రష్యా ప్రతినిధులను కలిసేందుకు ఉక్రెయిన్ సిద్ధంగా ఉందన్నారు. సోమవారం మొదలయ్యే 30 రోజుల కాల్పుల విరమణను రష్యా ఉల్లంఘిస్తే మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధంగా ఉన్నట్లు బ్రిటన్ ప్రధాని స్టార్మర్ సహా పలువురు యూరప్ నాయకులు వెల్లడించారు.
ఇదిలాఉండగా కీవ్‌తో ప్రత్యక్ష చర్చలకు సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. ఈమేరకు ఇస్తాంబుల్‌ను చర్చల వేదికగా పేర్కొన్నారు. ఈ చర్చల ద్వారా కాల్పుల విరమణ అమల్లోకి అవకాశం ఉన్నట్లు చెప్పారు.