calender_icon.png 22 November, 2025 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హుజూరాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని వినతి

22-11-2025 12:00:00 AM

హుజురాబాద్,నవంబర్ 21(విజయక్రాంతి); హుజురాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని హుజురా బాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి శుక్రవారం కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును హైదరాబాద్ లోని మంత్రి కార్యాలయంలో శుక్రవారం కలిసి వినతిపత్రం శుక్రవారంఅందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. హుజురాబాద్ నియోజకవర్గంలోని అయిదు మండలాల్లో అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పూర్తి చేయడానికి తగిన బడ్జెట్ వెంటనే కేటా యించాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఇల్లందకుంట మండలంలో రాచపల్లి నుండి బూజునూర్ గ్రామాలను కలిపే రోడ్డు, నాగంపేట నుండి రాచపల్లి వెళ్లే రోడ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని, రాచపల్లి బ్రిడ్జ్ పూర్తి స్థాయిలో కుంగిపోయిందని అన్నారు. వెంటనే వీటికి నిధులు మంజూరు చేయాలని కోరారు. నియోజకవర్గంలోని ఇతర ప్రధాన రహదారులు, కాల్వల ప్రాజెక్ట్ నిర్మాణం, శాశ్వత మౌలిక వసతులు, హుజురాబాద్ పట్టణంలో మినీ స్టేడియం వంటి కీలక ప్రాజెక్టులు నిలిచిపోయాయని, వీటి గురించి గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా వివరంగా చెప్పినట్లు గుర్తుచేశారు.

హుజురాబాద్ సమగ్ర అభివృద్ధి కోసం కనీసం వెయ్యి కోట్ల నిధులను మంజూరు చేసి, అనుమతులు పొందిన పనులు సహా పెండింగ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చూడాలని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సానుకూలంగా స్పందించి, హామీ ఇచ్చినట్లుఆయనతెలిపారు.