19-07-2025 12:00:52 AM
అభివృద్ధి చేసిన మాకు అప్పులా అధికారంతో మీకు మెప్పులా?
గద్వాల, జూలై 18 ( విజయక్రాంతి ) జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల మాజీ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు సురవరం లోకేష్ రెడ్డి, సర్పంచ్ల సంఘం నాయకుడు శేషన్ గౌడ్ ఈదన్న లను శుక్రవారం ఉండవల్లి ఎస్త్స్ర శేఖర్ సార్ ఆధ్వర్యంలో ప్రివెంట్ అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు సొంత డబ్బుల ద్వారా గ్రామ పంచాయతీలను అభివృద్ధి చేసి అప్పుల పాలయ్యామని బిల్లును చెల్లించమని అడిగిన మమ్ములను అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
గత పాలకుల మెప్పులు పొందడం కై అధికారుల ఒత్తిడిల మేరకు అభివృద్ధి చెపట్టామని ఏమైనా ఉంటే వారిపై చర్యలు తీసుకుని మా పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని నేటి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామన్నారు. ఎన్నడూ లేని విధంగా గ్రామపంచాయతీలకు స్థలాలను భవన నిర్మాణాలు వైకుంఠధామము, రైతు వేదిక, డంపింగ్ యార్డ్,ప్రకృతి వనం వాటిని నిర్మించామని.
ఈ అభివృద్ధిని చూసైనా మమ్ములను కనికరించి మా పెండింగ్ బిల్లులను మాట ఇచ్చిన ప్రకారం ప్రత్యేక నిధుల ద్వారా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుచున్నామన్నారు. సొంత డబ్బులు పెట్టి అప్పుల పాలైన మమ్ములను గాలికి వదిలేసి మరల గ్రామపంచాయతీ ఎన్నికలు పెడతామంటే ఎట్లా,మా పెండింగులు తప్పకుండా మంజూరు చేసి,ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వానికి మనవి లేదంటే, మునుముందు ధర్నాలే కాదు ఆత్మహత్యలు చేసుకుంటామని, వారు తెలిపారు.