19-07-2025 12:00:00 AM
- ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ జూలై 18 (విజయ క్రాంతి) : మహిళలను కోటీశ్వరులను చేయాలని సంకల్పంతో ప్రజాపాలన ప్రభుత్వం పరుగులు పెడుతుందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అ న్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో శిల్పారామం లో ఇందిరా మహిళా శక్తి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులకు కోటి 67 లక్షలు వడ్డీ లేని రు ణాలు, బ్యాంకు ద్వారా 7 కోట్ల 90 లక్షల రుణాలు మంజూరు, మహిళా సంఘాల సభ్యులకు రూ 13.87 లక్షలు మాఫీ,మహిళా సంఘాల కు కేటాయించిన ఆర్టీసీ బస్సు ద్వారా ప్రతి నెలా వచ్చే రూ 69 వేల చెక్కును ఎమ్మెల్యే అందజేశారు.
ప్రమాదవశాత్తు మరణించిన మరణించిన మహిళా సంఘాల సభ్యుల కుటుంబ సభ్యులకు పది లక్షల చొప్పున ఇద్దరికీ చెక్కుల పంపిణీ చే శారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి గా పదవీ బాధ్యతలు చేపట్టిన మూడు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారన్నారు. సిలిండర్ రాయితీ ఇవ్వడంతో పాటు మహిళా శక్తి క్యాంటీన్లు , పెంట్రోల్ బంక్ లకు ఇప్పుడు ఆర్టీసీ బస్ లకు ఓనర్లను చేస్తున్నామన్నారు. మహిళలు ముందుకు వచ్చి బాధ్యత తీసుకుంటే విజయం సాధిస్తారు అనే నమ్మకం విశ్వాసం ఉందన్నారు.
అందుకే తెలంగాణ రాష్ట్రంలో విద్యావ్యవస్థను గాడిలో పె ట్టేందుకు అమ్మ ఆదర్శ పాఠశాలల బాధ్యతను మహిళా సంఘాల సభ్యులకు గత సంవత్సరం అప్పగిస్తే అద్భుతమైన ఫలితాలు వచ్చాయని, ఈ విద్యాసంవత్సరం లక్షా తొంభై వేలమంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పొందారని, ఇది మహిళల విజయమన్నారు. ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ విజయేందిర బోయి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డిఆర్డీఎ పిడి నర్సింహులు , డిఆర్డీఓ అదనపు పిడి శారద, సెర్ఫ్ డైరెక్టర్ కాశీ విశ్వేశ్వరయ్య, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి,డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ మహిళా సమాఖ్య సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.