calender_icon.png 14 September, 2025 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రివిధ దళాధిపతులతో ప్రధాని సమావేశం

13-05-2025 01:28:01 AM

భారత్ డీజీఎంవోల చర్చల్లో వ్యవహరించాల్సిన తీరుపై సమీక్ష

న్యూఢిల్లీ, మే 12: ప్రధాని నరేంద్రమోదీ సోమవారం త్రివిధ దళాధిపతులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్‌చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తదితర అధికారులు పాల్గొన్నారు. భారత్ కాల్పుల విరమణ, పాక్ ఉల్లంఘన..తదితర అంశాలతో పాటు భారత్ డీజీఎంవో(డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్) చర్చల్లో ఏం మాట్లాడాలో..ఎలా వ్యవహరించాలో సమీక్షించారు.