10-09-2025 01:47:30 AM
మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్
హైదరాబారాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియో జకవర్గం రహమత్ నగర్ డివిజన్ పరిధిలోని హెచ్‌ఎఫ్ నగర్, శ్రీ రామ్‌నగర్ బస్తీలో రూ.2.3 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, గడ్డం వివేక్, స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జూబ్లిహిల్స్ అభివృద్ధికి ప్రాధాన్యత ను వివరించారు.
ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రతి అడుగులోనూ తాము కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, మాజీ ఎంఎల్‌ఏ ఏనుగు రవీందర్‌రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నవీన్ యాదవ్, భవాని శంకర్ తదితరులు పాల్గొన్నారు.