calender_icon.png 9 November, 2025 | 12:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు అవస్థలు పడుతున్నా పట్టించుకోని సర్కార్

08-11-2025 12:00:00 AM

నిజామాబాద్ ఎంపీ అరవింద్ 

నిజామాబాద్ నవంబర్ 7 (విజయక్రాంతి) : ధాన్యం సేకరణలో అడుగడుగునా అవాంతరాలు ఉన్నాయని పద్ధతి ప్రకారంగా ధాన్యం సేకరణ జరగడం లేదని, అసంపూర్తి ప్రక్రియతో ధాన్యం సేకరణ ప్రభుత్వం చేపట్టడంతో రైతులు అనేక  అవస్థలు పడుతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు. శుక్రవారం బిజెపి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  తెలంగాణ ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు.

2014 లో కేవలం 10 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్రం కొనుగోలు చేసేదని  కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తోందని వివరించారు. పంటల మార్పిడి పై ప్రభుత్వం వ్యవసాయ అధికారుల చేత రైతులకు అవగాహన దించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్ మెంట్ ఆపేసిన కాంగ్రెస్, బీఆర్ ఎస్ పార్టీలు బిసిల గురించి పార్టీమాట్లాడటం సిగ్గు చేటని విమర్శించారు. సీఎం రేవంత్ కేసీఆర్ కు గులాం గిరి చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గరుస్తున్న అవినీతి, అక్రమాలకు పాల్పడిన ఒక్కరినైనా అరెస్ట్ చేశారా అని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు పట్టించుకోని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లకు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఓట్లడిగే అర్హత లేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు దినేష్ కుల చారి, మాజీ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ బిజెపి రాష్ట్ర కార్యదర్శి స్రవంతిరెడ్డి, పోతన్‌కర్ లక్ష్మీనారాయణ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.