calender_icon.png 8 January, 2026 | 5:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అస్సాం స్కీనింగ్ కమిటీ చైర్మన్‌గా ప్రియాంక

05-01-2026 12:00:00 AM

ఏఐసీసీ ప్రధానకార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు

న్యూఢిల్లీ, జనవరి 4: అస్సాం స్కీనింగ్ కమిటీ చైర్మన్‌గా ఎంపీ ప్రియాంక గాంధీ నియమితులయ్యారు. ఈ కమిటీలో సభ్యులుగా ఎంపీలు ఇమ్రాన్ మసూద్, సప్తగిరి శంకర్, సిరివెల్ల ప్రసాద్‌ను ఉంటారని కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టం చేసింది. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సంవత్సరం లోనే అస్సాంలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనాయకురాలు, ఎంపీ ప్రయాంకాగాంధీకి పార్టీ కీలక బాధ్యతలను అప్పగించింది. ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ముందు చేయాల్సిన అంతర్గత సంప్రదింపులు వంటివాటికి ఈ కమిటీ బాధ్యత వహించనుంది. ఇక పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, పుద్దుచ్చేరికి కూడా స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసినట్లు కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.