calender_icon.png 8 August, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయ అభివృద్ధికి సంపూర్ణ సహకారం

08-08-2025 01:39:10 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

రూ.8.60 కోట్లతో భారీ రాజగోపురం నిర్మాణం 

గుమ్మడిదల, ఆగస్టు 7 : రాష్ర్టంలోనే ప్రముఖ శైవ క్షేత్రంగా పేరొందిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. దేవాలయం ఆవరణలో రూ.8.60 కోట్ల వ్యయంతో 142 అడుగుల పొడవుతో 9 అంతస్తులతో నిర్మించ తలపెట్టిన రాజగోపురం పనులకు గురువారం ఎమ్మెల్యే జీఎంఆర్ శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీఎంఆర్ మాట్లాడుతూ ఘనమైన చరిత్ర కలిగిన బొంతపల్లి దేవస్థానం అభివృద్ధికి గత దశాబ్దికాలంగా సంపూర్ణ సహకారం అందిస్తున్నామని తెలిపారు. ఆలయంలో రాజ ప్రాకారం, మూడు రాజగోపురాలు సైతం నిర్మించడం జరిగిందని తెలిపారు. భక్తులు, దాతల సహకారంతో భవిష్యత్తు తరాలకు ఆలయ ప్రాశస్త్యం తెలిసేలా రాజగోపురం నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పి మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, ఆలయ చైర్మన్ ప్రతాప రెడ్డి, మాజీ చైర్మన్ భద్రప్ప, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ పుర ప్రముఖులు, ఆలయ కమిటీ డైరెక్టర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు;పాల్గొన్నారు.