calender_icon.png 8 August, 2025 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజస్థాన్ మాజీ సీఎంను కలిసిన హరికృష్ణ

08-08-2025 01:41:17 AM

సిద్దిపేట, ఆగస్టు 7 (విజయక్రాంతి) : సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పూజల హరికృష్ణ రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ను ఢిల్లీలోని ఆయన  నివాసంలో మెదక్ డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులుతో కలిసి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ర్టంలో అమలవుతున్న పథకాలను ఆయనకు వివరించడంతోపాటు, బీసీ బిల్లు పైన చర్చించారు. బీసీ బిల్లుపై కేంద్రం అవలంబిస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అశోక్ గెల్లాట్ సూచించినట్లు హరికృష్ణ తెలిపారు.