08-08-2025 01:41:52 AM
కానుకుంట రోడ్డు సమస్యపై నిరసన
గుమ్మడిదల, ఆగస్టు 7 : బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు రాంచందర్రావు పిలుపు మేరకు గుమ్మడిదల మండల కేంద్రంలోని కానుకుంట గ్రామం నుండి గుమ్మడిదల వరకు మహా సంపర్క్ అభియాన్ బైఠక్స్, ర్యాలీలు నిర్వహించారు. గురువారం ఉదయం పాదయాత్ర కార్యక్రమాన్ని జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, గుమ్మడిదల మండల అధ్యక్షులు కావలి ఐలేష్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున పాదయాత్ర, ర్యాలీలు నిరసన కొనసాగించారు.
మండలంలో గల ప్రధాన సమస్యలను వెలుగులోకి తేవడానికి కానుకుంట నుండి గుమ్మడిదల రోడ్డులో పాదయాత్ర, ర్యాలీ నిర్వహించే కార్యక్రమం విజయవంతంగా కొనసాగించారు. జిల్లా రథసారధి గోదావరి మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా కానుకుంట రోడ్డు మాత్రం అభివృద్ధికి నోచుకోలేదని, బిఆర్‌ఎస్, కాంగ్రెస్ దొందుదొందేనని విమర్శించారు. పాలకులు మొండి వైఖరి వీడాలని, కానుకుంట రోడ్డును నాలుగు లైన్ల రోడ్డు చేయాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో ఇంకా ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సామల అంజిరెడ్డి, గుమ్మడిదల మండలం మహిళా మోర్చా అధ్యక్షురాలు సృజనలక్ష్మి, అనిత, మండల ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, మండల సీనియర్ నాయకులు రాజిరెడ్డి, యాదగిరి, సత్యనారాయణ, రాంరెడ్డి, సాయికుమార్, భాస్కర్ గౌడ్ రాజశేఖర్ సరి గారి వీరారెడ్డి, బూత్ అధ్యక్షులు మధు, యాదగిరి, నాగరాజు, జనార్దన్ రెడ్డి, సాయి కుమార్ రెడ్డి, బాల్రెడ్డి, నల్లవల్లి మనోజ్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు గ్రామస్తులు భారీ ఎత్తున;పాల్గొన్నారు.