calender_icon.png 5 November, 2025 | 6:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ నిర్లక్ష్యంతోనే చేవెళ్ల ప్రమాదం

05-11-2025 01:18:53 AM

-పదేండ్లు అధికారంలో ఉండి పట్టించుకోలేదు

-ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి 

హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాం తి): చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ వద్ద సోమవారం జరిగిన ప్రమాదానికి కేవలం డ్రైవర్ల తప్పిదం కాదని, పదేండ్లు పాలించిన బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. రియల్ ఎస్టేట్ కోసం 2017 నుంచి 2022 వరకు భూసేకరణ చేయలేదని, ఈ హైవేలో బీఆర్‌ఎస్ నిర్లక్ష్యంతో ప్రజల ప్రాణాలు పోతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. నిజాం కాలంలో నిర్మించిన వంకర రోడ్డును ఇప్పటిదాకా ఎవరూ సరిచేయలేదన్నారు.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేవెళ్ల హైవేను 2016లో గెజిట్ ద్వారా నేషనల్ హైవేగా ప్రకటించారని గుర్తుచేశారు. దీంతోపాటు ప్రకటించిన మిగతా జాతీయ రహదారులన్నీ పూర్తయ్యాయని, కానీ 2022 వరకు ఈ హైవేకు సంబంధించి బీఆర్‌ఎస్ భూసేకరణ చేయలేదని మండి పడ్డారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. హైవేలు ఇవ్వడం కేంద్రం బాధ్యత అని, భూసేకరణ చేపట్టడం రాష్ర్ట ప్రభుత్వ బాధ్యత అన్నారు. 2023లో హైవే పనులు మొదలు కాకుండా మర్రి చెట్ల కోసం గ్రీన్ ట్రిబ్యునల్‌కు కొంత మంది వెళ్లడంతో హైవే పనులు ముందుకు వెళ్లలేదన్నారు. ఈ కేసు స్టే మొన్ననే ఆర్డర్ విత్ డ్రా అయ్యాయని, త్వరలో పనులు మొదలు కానున్నాయని తెలిపారు. తప్పు బీఆర్‌ఎస్ చేసి.. సోషల్ మీడియాలో తనపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. హైవే మంజూరు చేయించిన తనపైనే కుట్రలా? అని ప్రశ్నించారు.