calender_icon.png 29 January, 2026 | 10:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హామీలు మాటలకే పరిమితం!

14-01-2026 12:00:00 AM

హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు అధికారం చేపట్టడం కోసం ఆయా రాష్ట్రాల్లో అప్పటికే ఉన్న ఆర్థిక పరిస్థితులు తెలిసి కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసే ఉచిత సంక్షేమ పథకాల ఆశ చూపి అధికారంలోకి వచ్చాయి. ప్రస్తుతం వారు ఇచ్చిన హామీలను నేరవేర్చలేకపోవడం లేదా అరకొరగా అమలు చేసి గత ప్రభుత్వాలుపై విమర్శలు చేయడం పరిపాటిగా మారిపోయింది. 

నేడు చాలా రాష్ర్ట ప్రభుత్వాలు, పాలకులు ఒక విచిత్రమైన విషయాన్ని మన ముందు ఉంచుతున్నారు. చాలా రాజకీయ పార్టీలు, కూటములు ఎన్నికల మేనిఫె స్టో లేదా ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓటర్లకు చాలా వాగ్దానాలు, హామీలు ఇవ్వ డం ఆనవాయితీ. అయితే ఎన్నికల వేళ అలవిగాని హామీలతో ఓట్లు దండుకుని అధి కారంలోకి వస్తున్నారు . అయితే నాయకులు ఇచ్చిన హామీలను నమ్మి ఓటర్లు ఆ యా పార్టీలను అధికారంలో కూర్చోబెట్టడం జరుగుతుంది. తీరా అధికారం చేపట్టిన తరువాత, ఇచ్చిన హామీలను నేరవేర్చలేకపోవ డం అలవాటుగా మారిపోయింది. అధికారంలో ఉన్నన్నాళ్లు గత ప్రభుత్వాల పని తీరుపై విరుచుకుపడుతూ కాలయాపన చే స్తుంటారు తప్ప హామీలు నెరవేర్చాలన్న వి షయం మాత్రం గుర్తుంచుకోరు.

దీనికి మన ఉభయ తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రస్తు తం తెలంగాణ పాలకులు గత ప్రభుత్వం రాబడికి మించి, ఖర్చులు ఎక్కువ చేసిందని, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిందని ఆరోపిస్తున్నారు. పాలకులు చెబుతున్న మాటలు వాస్తవమే కావచ్చు. మరి ఈ విషయం తెలిసి కూడా ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన పాలకులు ఎన్నికల ప్రచార సమయంలో ప్రజలకు, ఓటర్లకు, ముఖ్యం గా యువతకు అనేక రాయితీలు, ప్రోత్సాహకాల హామీలను ప్రకటించారు. తీరా అధికా రం చేపట్టిన తరువాత ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను టార్గెట్ చేసుకుంటూ పాలన కొనసాగిస్తున్నారు. మన పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇలాంటి అంశాలే మన కళ్ల ముందు కనపడుతున్నాయి.

ఉచితాలు ఎందుకు?

గత ప్రభుత్వాలు వివిధ ఉచిత, సంక్షేమ పథకాలు అమలు చేయడం కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు అప్పులుగా తెచ్చారో నేటి పాలకులకు స్పష్టంగా తెలిసే ఉంటుం ది. అప్పులతో రాష్ర్ట ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉందన్న విషయం నేటి పాల కులకు తెలిసినప్పుడు తలకు మించిన ఉచిత సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఎన్నికల సమయంలో వాగ్దానాలు ఎందుకు చేసి నట్టు? తీరా గద్దె ఎక్కిన తరువాత ఆర్థిక సాయం కోసం ఎగాదిగా చూడటం ఎందు కు? గత ప్రభుత్వాలుపై విమర్శలు చేయడం ఎందుకు? గత పాలకులు గళ్లా పెట్టె ఖాళీ చేశారని, రాష్ట్రాన్ని అప్పులు ఊబిలోకి నెట్టేశారని విమర్శించడం ఎందుకు? అనేది ఆలోచించుకోవాలి. ఒక విధంగా మోసపు వాగ్ధానాలు చేసి, ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకునేది అధికారం చేపట్టడానికే కదా? అన్ని తెలిసి తమాషాలు చేయడమెందుకనేది గ్రహించాలి. ఇకనైనా ఈ వైఖరి మారా లి. మోసపు వాగ్ధానాలు, నమ్మకశక్యం కాని హామీలు ఇచ్చి ఓట్లు దండుకుని అధికారం చేపట్టాలనే ఆలోచనను విరమించుకుంటే బాగుంటుంది.

అప్పుల ఊబిలోకి..

హిమాచల్ ప్రదేశ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు అధికారం చేపట్టడం కో సం ఆయా రాష్ట్రాల్లో అప్పటికే ఉన్న ఆర్థిక పరిస్థితులు తెలిసి కూడా కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేసే ఉచిత సంక్షేమ పథకాల ఆశ చూపి అధికారంలోకి వచ్చాయి. ప్రస్తుతం వారు ఇచ్చిన హామీలను నేరవేర్చలేకపోవడం లేదా అరకొరగా అమలు చేసి గత ప్రభుత్వాలుపై విమర్శలు చేయడం పరిపాటిగా మారిపోయింది. ఏది ఏమైనా, అధి కారం చేపట్టడం కోసం అడ్డదిడ్డంగా వ్యవహారిస్తున్నారు. ఇది సబబు కాదు. వీరు ఇ చ్చిన హామీలను నేరవేర్చలేకపోవడం కోసం దాదాపు ప్రతీవారం రిజర్వ్ బ్యాంక్ వేలంలో పాల్గొనటం, ప్రభుత్వ ఆస్తులను అమ్మడం లేదా తనఖా పెట్టడం జరుగుతుంది.

పైగా ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి ఎక్కువ వ డ్డీకి వివిధ బ్యాంకులు/ఆర్థిక సంస్థలు ద్వారా అప్పులు తేవడం ప్రభుత్వాలు అలవాటుగా మార్చుకున్నాయి. ఈ విధంగా ఆయా రా ష్ట్రాలను పాలన చేయాల్సిన ప్రభుత్వాలే అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నాయి. అదీగాక  తెచ్చిన రుణాలన్నీ ‘అనుత్పాదక వ్యయం’ అనగా ఉత్పత్తి రంగాలపై ఖర్చు చేయకపోవడం వల్ల తీసుకున్న రుణాలు, దీనికి కట్టవలసిన వడ్డీలు తడిపిమోపెడవుతున్నా యి. చివరికి రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు అధ్వానంగా తయారై అధోగతి పాలవుతున్నాయి. అయితే ఇది కేవలం రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కావడం లేదు. రాష్ట్రాల్లో మొదలవుతున్న రుణభారం దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పెను ప్రభావం చూపుతుంది. 

పేర్లు మారిస్తే సరిపోదు..

ఇక ప్రస్తుతం కేంద్ర పాలకులు కూడా తమ ఉనికిని పెంచుకునే ప్రయత్నాలు చేయ డం ముమ్మరం చేశారు. గత కాంగ్రెస్ పాలనపై తరచూ విమర్శలు చేయడం, ముస్లిం పాలకుల ఆనవాళ్లు చెరిపే ప్రక్రియను చేపట్టారు. ఆనవాళ్ళు చెరిపినంత మాత్రాన చరి త్ర మారదు కదా అన్న విషయం గుర్తుంచుకోవాలి. పేర్లు మార్పు ద్వారా ప్రగతి అనే పద్ధతిలో ఉంటున్నారు తప్ప, అసలు దేశంలో తాండవిస్తున్న నిరుద్యోగ నియంత్రణకు ఏమాత్రం చర్యలు చేపట్టడం లేదు. అ ధిక ధరలు అదుపు లేదు.

కల్తీలకు కనీసం చెక్ పెట్టడం లేదు. ‘టెంపుల్ టూరిజం’పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు తప్ప, దేశ యు వతకు ఉద్యోగావకాశాలు కల్పించే ప్రయత్నాలు ఎంతమాత్రం జరగడం లేదు. విద్యా ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. నైపుణ్యాల కొరత యువతను వెం టాడుతూనే ఉంది. అక్రమ వలసలను అరికట్టేందుకు సరైన చర్యలు లేవు. ఎప్పుడూ దేశంలో వివిధ రాష్ట్రాల్లో అధికారం చేపట్టడం కోసం ఎక్కువ సమయం కేటాయి స్తున్నారు తప్ప, ప్రతిపక్ష పార్టీలు, ఆయా పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై దృష్టి సా రించడం తప్ప, రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కనీసం అభినందించే కార్యక్రమాలు మచ్చుకైనా కనిపించడం లేదు. 

భరోసా అవసరం..

ఇటీవల ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తున్న అమెరికా మన భారత్‌పై ఇష్టపూరిత మైన వ్యాఖ్యలు చేస్తున్నది. ‘భారత్ యుద్ధం నేనే ఆపాను’ అని ట్రంప్ పదే పదే అంటున్నారు. మరో వైపు సుంకాలు పెంచు తూ మనపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పు కునే మన భారతదేశం అమెరికా అవలంభిస్తున్న కొన్ని నియంత విధానాలను ప్రశ్నించాల్సిన అవసరముంది. ప్రపంచ దేశాలన్నింటిని ఒకేతాటి పైకి తీసుకురావడంతో భారత్ ప్రయత్నం చేయాలి. అన్ని దేశాలు కలిసి అమెరికా ఒంటెద్దు పోకడల ను నిరసించాల్సిన అవసరముంది. ఐక్యరాజ్యసమితి కూడా రంగంలోకి దిగాలి. అలీనో ద్యమ కూటమి దేశాలను, జిౌ-20 దేశాలను, ఎస్సీవో కూటమి దేశాల ద్వారా అమెరికా పద్దతులకు చెక్ పెట్టాలి.

లేదంటే భవిష్యత్తులో ఈ నిరంకుశ విధానాలను అన్ని దేశా లను ఏదో ఒక కారణంతో కబలించే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటువంటి పరిస్థితుల్లో చాలా ఉదాసీనంగా వ్యవహరించాల్సిన అవసరముంది. అన్ని విషయాలు తెలిసి కూడా తటస్థంగా ఉండడం మంచిది కాదు. ఏ విషయంలోనైనా పా లకులు తెలిసి తమాషాలు చేయడం ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. తటస్థంగా ఉం డడం వల్ల తాత్కాలిక ప్రయోజనాలు పొందవచ్చు. కానీ దీర్ఘకాలంలో తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

అదే సమయంలో పాలకులపై భారం వేయకుండా దేశ ప్రజలు కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉం డాలి. తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి ఓ టు వేయడం మానుకోవాలి. వారి భవిష్యత్తుకు, వారి పిల్లల భవిష్యత్తుకు ఉద్యోగ ఉ పాధి అవకాశాలు కల్పించే పార్టీలకు పట్టం కట్టాలి. పారదర్శకంగా, ప్రజల కోసం పాటుపడే పార్టీలకు పట్టం కట్టాలి. కుల, మత, వర్గ భావనతో కాకుండా, భవిష్యత్తుకు భరోసా కల్పించే పార్టీలకు పట్టం కట్టాలి. తలసరి ఆదాయం పెంచే పథకాల వైపు ప్రభుత్వాలు నడిచే విధంగా సూచనలు సలహాలు ఇవ్వాల్సిన అవసరముంది.