12-12-2025 12:51:03 AM
మహబూబాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): సమాజంలో న్యాయవ్యవస్థ పట్ల అంచంచల విశ్వాసం కలిగి ఉండటం గర్వకారణమని సీనియర్ న్యాయవాదులు భువనగిరి రవీంద్ర గుప్తా, లయన్ కొండపల్లి కేశవరావులు అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మహబూబాబాద్ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ బి. వీరన్న అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులైన రవీంద్ర గుప్తా, కేశవరావు లను ఘనంగా సత్కరించారు.
కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఎదురయ్యే అనేక అంతర్జాతీయ, జాతీయ, స్థానిక సమస్యల పరిష్కారానికి కోర్టులను ఆశ్రయిస్తారని పేర్కొన్నారు. అందువల్లే న్యాయవ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం ఉందని చెప్పారు. లయన్స్ క్లబ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉందని, క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలు అన్ని వర్గాలకు ఎంతో మేలు చేస్తున్నాయని తెలిపారు.
లయన్స్ సేవలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్లబ్ అధ్యక్షులు డాక్టర్ బి. వీరన్న మాట్లాడుతూ క్లబ్ నేతృత్వంలో అన్ని కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరిస్తున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పరకాల రవీందర్ రెడ్డి, కోశాధికారి కొండపల్లి కరుణాకర్ రెడ్డి, జోన్ చైర్మన్ మాధవపెద్ది వెంకట్ రెడ్డి,మైక్రో కమిటీ సభ్యులు అనుమాల వెంకటేశ్వర్లు,
సీనియర్ సభ్యులు రామసహాయం వెంకట్ రెడ్డి, రావుల రవిచందర్ రెడ్డి, పరకాల శ్రీనివాస్ రెడ్డి, బవిరిశెట్టి నాగేశ్వరరావు, డాక్టర్ దేవిరెడ్డి, బి. అనిల్ గుప్తా, పీ.వీ. ప్రసాద్, ఎస్. భీం సాగర్, చౌడవరపు సుధాకర్, డోలి సాయి కిరణ్, బొడ్ల మధుసూదన్ రావు, రిటైర్డ్ తహసీల్దార్ పరకాల శ్రీనివాస్ రెడ్డి, చంద్రశేఖర్, రాజ్ కుమార్, మాలె కాశీనాథ్, పమ్మి సనాతన చారి, నవాబ్, సాదుల సురేష్ బాబు, ఆల్టెక్ రమేష్, ఇంద్రసేనారెడ్డి, పి. లక్ష్మి నారాయణ, వి. ఏకాంబరం పాల్గొన్నారు.