12-12-2025 12:47:55 AM
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు
హనుమకొండ టౌన్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం పరిధిలోని బైరంపల్లి, సిద్ధాపూర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన స ర్పంచ్ అభ్యర్థులు కల్లెబోయిన కుమారస్వామి, మంద రాజు, వార్డు మెంబర్ల గెలుపు కోసం నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజును గ్రామాలలోని మహిళామణులు సాంప్రదాయ కోలాటలతో స్వా గతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే సర్పం చ్ అభ్యర్థులు, వార్డు సభ్యుల తో కలిసి ఇం టింటా ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరా రు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినాక పేద ప్రజలు కడుపునిండా తినాలనే సంకల్పంతో సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
గత ప్రభుత్వం ప దేళ్ల పాలనలో అర్హులైన పేదలకు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు. మహిళాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఇందిరమ్మ చీరలు అందిస్తుందని తెలిపారు. సిద్దాపూర్ గ్రామ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని, గ్రామ సర్పంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంద రాజును భారీ మెజార్టీతో గెలిపించాలని,
రాజు నాకు చిన్న కొడుకు లాంటివా డని కష్టపడే మనస్తత్వం ఉన్నవాడని, పేదింటి బిడ్డ అని మంచి చేసే వ్యక్తి అని ప్రజలందరూ గమనించాలని రాజు కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పాటైనాక మహిళలను కోటీశ్వరురాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మహిళలకు పెట్రోల్ బంకు, సోలార్ పవర్ బస్సులు, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని అలాగే ఇప్పటివరకు గ్రామంలో 24 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చామని, ఇందిరమ్మ ఇండ్లు నిరంతర ప్రక్రియని అన్నారు.
ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లాకి కిసాన్ అధ్యక్షు లు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి, ఆత్మకూరు ఏఎంసి వైస్ చైర్మన్ తంగళ్ళపల్లి తిరుపతి, అసంపర్తి మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్రెడ్డి, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.