22-08-2025 01:41:22 AM
ఇల్లందు, ఆగస్టు 21, (విజయక్రాంతి)ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని గురువారం సిఐటియు ఆధ్వర్యంలో మండల పరి ధిలోని రొంపేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ కవితకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు అబ్దుల్ నబీ, తాళ్లూరి కృష్ణలు మాట్లా డుతూ ఆశా వర్కర్లకు పారితోషకం కాకుం డా ఫికస్డ్ వేతనాలు ప్రతి నెల మొదటి వా రం జీతాలు చెల్లించాలని కోరారు.
ప్రజారోగ్యం పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో పనిచే స్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వ డం లేదని వారితో ప్రభుత్వం వెట్టిచాకిరి చే యిస్తుందన్నారు. ఆశ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 25న కలెక్టరేట్ వద్ద ధర్నా, సెప్టెంబర్ 1న చలో హైదరాబాద్ క మిషనరేట్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చా రు. ఈ కార్యక్రమంలో మల్లీశ్వరి లక్ష్మీ చంద్రకళ తదితరులుపాల్గొన్నారు.