calender_icon.png 14 September, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈవీఎం వ్యవస్థతో ప్రజాస్వామ్య పునాదులను బలహీనపరిచే ప్రమాదం

14-09-2025 12:34:54 AM

ఖైరతాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి) : ఎన్నికల నిర్వహణలో ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్) వ్యవస్థ తో ప్రజాస్వామ్య పునాదులను బలహీనపరిచే ప్రమాదం ఉందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో నిపుణుల హె చ్చ రికలను భారత ఎలక్షన్ కమిషన్  పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు.

శనివారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్లో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కమిటీ (సిఆర్ పి సి) జాతీయ కన్వీనర్ సంగటి మనోహర్ అధ్యక్షతన ఈవీఎం వ్యతిరేక జాతీయ ఉద్యమంలో భాగంగా ‘ఈవీఎం వద్దేవద్దు - బ్యాలె ట్ పేపరే ముద్దు‘ అనే అంశంపై రౌండ్ టేబు ల్  సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథు లుగా ఆర్ పి ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, బిఎల్‌ఎఫ్ చైర్మన్ నల్ల సూర్యప్రకాశ్, రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు వి.జి.ఆర్. నారగోని,  న్యాయవాది అమిన్ పిరా, తేలంగాణ సమన్వయకర్త బి.ఎన్.రత్నలు హాజరై మాట్లాడా రు. ఈవీఎం హ్యాకింగ్, ట్యాంపరింగ్ లాంటి అడ్డదారుల్లో, అనైతిక, అనాగరిక, అప్రజాస్వామిక పద్ధతుల్లో గెలిచే తీరుకు స్వస్తిపల కాలని సూచించారు.

నిస్వా ర్థ, నిజాయితీ, పారదర్శకత జవాబుదారీతనంతో కూడిన బ్యాలెట్‌తో ప్రజలు, ప్రజాస్వామ్యం గెలిచే ఎన్నికల కోసం పట్టుపడదాం, ఉద్యమిద్దామ ని పిలుపునిచ్చారు. సంగటి మనోహర్ మా ట్లాడుతూ ఈవీఎం ప్రభావం, దుష్పలితాలు ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలపై పడటం ఖాయమని, అందుకే వాటిని ఎక్కడ వాడకుండా నిషేధించాలన్నారు.

అభివృద్ధి చెంది న ప్రపంచ దేశాలు ఎందుకు ఈవీఎం వాడ టం లేదో ఒకసారి ఆలోచించాలన్నారు. ఈవీ ఎం వ్యతిరేక జాతీయ ఉద్యమం అన్ని సమస్యలకు ప్రత్యామ్నాయమని, దీనిని మహో ద్యమంగా మార్చుతామని తెలిపారు. ఈ సమావేశంలో మాల మహనాడు అధ్యక్షులు చెన్న య్య, అన్వరన్, మాస్టర్జీ, మహేశ్వర్రాజు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.