calender_icon.png 19 October, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చీఫ్ జస్టిస్ పై చేసిన దాడికి నిరసన

18-10-2025 12:16:04 AM

చిట్యాల,(విజయక్రాంతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయిపై బూటు విసిరి దాడికి పాల్పడిన సంఘటనపై ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ  శుక్రవారం చిట్యాల తాహాసిల్దార్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి పై దాడి చేయడం హేయమైన చర్య అని ఇది ముమ్మాటికి దళితులపై జరుగుతున్న దాడులకు నిదర్శమని అన్నారు.

సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఒక దళితుడు ఉండడాన్ని సహించలేని ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తులు కుట్రతో ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. దేశ అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి పైనే దాడి జరిగితే సామాన్య మానవుల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.  ఇది ముమ్మాటికి ఉన్నత వర్గాల కుట్టేర్నని, వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకొని రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కోరుతూ ఇన్చార్జి తాసిల్దార్ విజయలక్ష్మి కి వినతి పత్రం అందజేశారు.