సుందర్ పిచాయ్‌కి నిరసన సెగ
‘స్టాన్‌ఫర్డ్’ స్నాతకోత్సవం నుంచి విద్యార్థులు వాకౌట్
న్యూయార్క్, జూన్ ౧౫: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‌కి చేదు అనుభవం ఎదురైంది. తాజాగా అమెరికాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగిస్తుండగా సుమారు ౨౦౦ మంది విద్యార్థులు సభా స్థలం నుంచి వాకౌట్ చేశారు. ఇజ్రాయెల్ మిలిటరీ, అమెరికన్ ప్రభుత్వంతో గూగుల్ సంస్థ కుదుర్చు కున్న వివాదాస్పద ఒప్పందాలకు నిరసనగానే విద్యార్థులు స్నాతకోత్సవం పూర్తికాక ముందే నిష్క్రమించారు.
కొందరు విద్యార్థులు పాలస్తీనా జెండాలు ఊపుతూ, విజిల్స్ వేస్తూ నిరసన వ్యక్తం చేశారు. మరికొందరు సంప్రదాయ పాలస్తీనా స్కార్ఫ్‌లైన ‘కేఫియా లు’ ధరించి గూగుల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇజ్రాయెల్ ప్రభుత్వంతో గూ గుల్, అమెజాన్ సంస్థలు ఇటీవల 1.2 బిలియన్ డాలర్ల క్లౌడ్ కంప్యూటింగ్ ఒప్పందం ‘ప్రాజెక్ట్ నింబస్’ కుదుర్చుకున్నాయి. గాజా యుద్ధంలో ఇజ్రాయెల్ సైన్యానికి, నిఘా వ్యవస్థలకు గూగుల్ సాంకేతికత సమకూరుస్తుందని విద్యార్థినేతలు ఆరోపిస్తున్నారు.






