03-11-2025 12:27:42 AM
ములకలపల్లి, నవంబర్ 2 (విజయక్రాంతి):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ దాడి అత్యంత హేయమైన చర్య అని బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు అన్నారు. మణుగూరులో బి ఆర్ ఎస్ కార్యాలయం పై జరిగిన దాడిని నిరసిస్తూ ఆదివారం ములకలపల్లి లో ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
మణుగూరులో బిఆర్‌ఎస్ కార్యాలయంపై ఒక పథకం ప్రకారం పార్టీ కార్యాలయంలో చొరబడి ఫర్నిచర్ ధ్వంసం చేసి తగలబెట్టడమే కాకుండా ఆఫీసులో ఉన్న కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడి గాయపరిచారని ఈ దాడి ఘటన విషయంలో పోలీస్,నిఘా వ్యవస్థలు విఫలమయ్యాయని విమర్శించారు .ఈ దాడి వెనక ఉన్న ప్రభుత్వ పెద్దలను, ప్రత్యక్షంగా దాడి చేసిన వారిని వెంటనే ప్రభుత్వ అధికారులు చట్ట పరమైన చర్యలు తీసుకొని మరలా ఇటువంటి దాడులు జరగకుండా వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీపీ మట్ల నాగమణి,శనగ పాటి సీతారాములు, పుష్పాల చందర్ రావు, బండి కొమరయ్య, తానం కృష్ణ, గడ్డం నాథనియేలు, భూక్యా ధర్మ, బొర్రా సుధాకర్, పుష్పాల హనుమంతు,పుష్పాల సాయి, పువ్వాల రమేష్,సూరం పుల్లారావు, నునావత్ రమేష్,భూక్యా నంద,తెల్లం నర్సింహారావు, పులి బాబురావు, జరుపుల శివ,బానోత్ ప్రసాద్,పత్తి బిక్షం, గండూరి ప్రమోద్,జై భీమ్ నర్సింహా,బండ్ల రాము, మోదుగు సతీష్,యేసుపాక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.