21-04-2025 12:36:01 AM
హిందూ సంఘాలతో కలిసి బీజేపీ భారీ ర్యాలీ
పటాన్ చెరు, ఏప్రిల్ 20 : పశ్చిమ బెంగాల్ లో హిందువులపై జరుగుతున్న దాడులను హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్ గూడా, కిష్ణారెడ్డిపేట హిందూ సంఘాలతో కలిసి బీజేపీ నాయకులు బీరంగూడ మండే మార్కెట్ వరకు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్ లో హిందువులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు. తక్షణమే హిందువులకు రక్షణ కల్పిం చాలని, దాడులకు తెగబడుతున్న వారిని కఠినంగా శిక్షించి తరిమికొట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న సంఘటనలకు బాధ్యత వహిస్తూ తక్షణమే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. హిందువులకు ఎలాంటి సమస్యలు వచ్చిన తాము అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్ల రమేష్, అమీన్ పూర్ బీజేపీ మండల అధ్యక్షుడు ఈర్ల రాజు, బీజేపీ నాయకులు రాజేందర్ గౌడ్, రాములు, శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, రాకేష్, వెంకటేష్, రాజు గౌడ్, కుమార్ గౌడ్, వీరాంజనేయులు, హిందూ సం ఘాల ప్రతినిధులుపాల్గొన్నారు.