calender_icon.png 19 October, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కస్తూర్బా పాఠశాల, సీతాఫల్ యూనిట్ సందర్శించిన ప్రత్యేక అధికారి

18-10-2025 08:18:22 PM

నవాబు పేట: మండల కేంద్రములోని కస్తూరిబా పాఠశాల, మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీతాఫలాల యూనిట్ ను మండల ప్రత్యేక అధికారి, ఎస్సీ కార్పొరేషన్ డీడీ సునిత ఎంపీడీవో జయరాం నాయక్ కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కస్తూరిబా పాఠశాల విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల బోధనా పద్ధతులను పరిశీలించారు. చదువులో నాణ్యత సృజనాత్మకను పెంపొందించే విధంగా ప్రతిభను వెలికి తీసే విధంగా  విద్యార్థులకు అందించాలని సూచించారు.

పదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో మాట్లాడుతూ వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించి తమ తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి గుర్తింపు తీసుకురావాలని తెలిపారు. దీంతోపాటు విద్యార్థులకు అందించే భోజనశాలను తణిఖీ చేసి మెనూ ప్రకారం భోజనం అందించాలని సూచించారు. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీతాఫలాల యూనిట్ ను పరిశీలించి భారీ ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఐకేపీ ఏపీఎం శ్రీహరి సీసీ లు సిబ్బందికి సూచించారు.