21-11-2025 12:48:47 AM
కలెక్టర్ వెంకటేష్ ధోత్రే
కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులు, సామాజిక, ప్రాథమిక, ఉప ఆరోగ్య కేంద్రాలకు వివిధ అనారోగ్య సమస్యలపై వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురు వారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఏరియా ఆసుప త్రి, సామాజిక ఆరోగ్య కేంద్రాలలో ఒప్పంద పద్ధతిన వైద్యులుగా పని చేయుటకు నిర్వహించిన ఇంటర్వ్యూ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాం, ప్రభు త్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి, తెలంగాణ వైద్య విధాన పరిషత్ జిల్లా సమన్వ యకర్త అవినాష్, ప్రభుత్వ ఆసుపత్రి పర్యవేక్షకులు అనిల్ లతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉప్పంద పద్ధతిన ఎంపికైన వైద్యులు ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన, వేగవంతమైన వైద్య సేవ లు అందించాలని తెలిపారు. భౌగోళికంగా జిల్లా పరిధి ఎక్కువగా ఉన్నందున మారుమూల ప్రాంతాలలోని ఆరోగ్య కేంద్రాలలో వైద్య సేవలు అందించాలని, ప్రజలతో మ ర్యాదగా మెలుగుతూ, సమయపాలన పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబం ధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.