23-05-2025 01:49:41 AM
మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహబూబ్ నగర్ మే 22 (విజయ క్రాంతి) : సబ్ స్టేషన్ లో ప్రమాదవశాత్తు ఇన్సులేటర్ తలపై పడి హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోడూరు గ్రామానికి చెందిన ఆర్టిజన్ శ్రీహరి గౌడ్ ని మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
అనంతరం ఈత చెట్టు మీది నుండి పడి హైదరాబాద్ కాచిగూడ లోని సాయి కృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహబూబ్ నగర్ జిల్లా కోడూరు గ్రామానికి చెందిన గడ్డం రాములు గౌడ్ ని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు.