calender_icon.png 23 May, 2025 | 5:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించాలి

23-05-2025 01:48:16 AM

కలెక్టర్ సంతోష్

గద్వాల,  మే 22 ( విజయక్రాంతి ) : వరిధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించాలని, వర్షాల నుంచి ధాన్యం తడవకుండా  టార్పాలిన్లతో భద్రపరచాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు. గురువారం గద్వాల్  మండలంలోని చెనుగొనిపల్లి, గుంటిపల్లి గ్రామంలోని ఐ.కే.పీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ నర్సింగ రావుతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి,తేమ శాతం,లారీ లోడింగ్, ఓపియంఎస్లో డేటా ఎంట్రీ తదితర అంశాలను పరిశీలించారు. వర్షాలు పడే అవకాశం ఉన్నందున,ధాన్యం తడిపోయే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల జిల్లా మేనేజర్ విమల,అడిషనల్ డి.ఆర్.డి.ఓ నర్సింహులు, మండల వ్యవసాయాధికారులు, ఏపియంలు, రైతులు,తదితరులు పాల్గొన్నారు.