calender_icon.png 12 January, 2026 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాజెక్టులకు ఆర్థిక సాయం చేయండి

11-01-2026 12:00:00 AM

  1. పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వాలి
  2. ట్రిపుల్ ఆర్, విమానాశ్రయాలు మంజూరు చేయాలి
  3. కేంద్ర ప్రీ బడ్జెట్ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క  

హైదరాబాద్, జనవరి 10 (విజయక్రాంతి): తెలంగాణలోని ప్రధాన ప్రాజెక్టుల కు ఆర్థిక సాయం చేయాలని, పాలమూరు ఎతిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మ లా సీతారామన్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. కేంద్ర బడ్జెట్ తయారీలో రాష్ట్రాలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. శనివారం న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ప్రీ బడ్జెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి.. ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.

ఒక దేశం కేంద్ర-రాష్ట్రాల సమన్వయం ద్వారానే పురోగమి స్తుందన్నారు. 2047 నాటికి దేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మా ర్చాలనే భారత ప్రభుత్వ లక్ష్యాన్ని అభినందిం చారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5.1 శాతంగా ఉందని, 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తాము తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను ఆవిష్కరించామని, దీని ద్వారా తెలంగాణను ప్రస్తుతం ఉన్న 200 బిలియన్ డాలర్ల నుంచి 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నారు.

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్రంలో వెయ్యికిపైగా కులాల వారీగా గురుకుల పాఠశాల లున్నాయన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు కూడా ఏర్పాటు చేస్తున్నామని, ప్రస్తుతం సెస్‌లు, సర్‌ఛార్జీల వాటా కేంద్ర పన్ను రాబడిలో 20 శాతానికి చేరిందన్నారు. 15వ ఆర్థిక సంఘం 41 శాతం పన్ను బదిలీకి సిఫార్సు చేసినప్పటికినీ 30 శాతమే అందుతోందని ఆయన వెల్లడించారు. దాదాపు రూ.1,55,000 కోట్ల సర్ ఛార్జీలను మౌలిక సదుపాయాల నిధికి మళ్లించాలి. లేదా వాటిని ప్రాథమిక పన్ను రేట్లలో కలిపి రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని కోరారు. 

మెట్రో ఫేజ్2కు అనుమతులివ్వాలి....

ప్రాంతీయ రింగ్ రెడ్ (ట్రిపుల్ ఆర్) ప్రాజెక్టును తక్షణమే మంజూరు చేయాలని కోరారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్2పై త్వరగా నిర్ణయం తీసుకుని అనుమతులివ్వాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలని, మిగిలిన జిల్లాల్లో కేంద్రీయ, జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరారు. వరంగల్, పెద్దపల్లి, ఆదిలాబాద్, కొత్తగూడెంలో విమానాశ్రయాలు మంజూరు చేయాలని తెలిపారు.

పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కోసం రూ.14,100 కోట్లు కేటాయించాలన్నారు. రేడియల్ రోడ్ల కోసం రూ.45 వేల కోట్లు, హైదరాబాద్ మురుగునీటి పారుదల ప్రణాళిక కోసం రూ.17,212 కోట్లు కేటాయించాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. తమ ప్రతిపాదనలపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తున్నట్లు ఆయన తెలిపారు.