13-08-2025 12:00:00 AM
కొత్తపల్లి, ఆగష్టు 12(విజయక్రాంతి): కరీంనగర్ నగరం లోని మానేరు డ్యాం కట్టకింద ముప్పు సంవత్సరాలుగా నివసిస్తున్న బతుకమ్మ కాలనీ, హస్నాపురం కాలనీ పేద కుటుంబాలకు ఇరిగేషన్ శాఖ జారీ చేసిన నోటీసుల గురించి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారిని కలిసి అందులో ప్రవేట్ ప్రాపర్టీ కొనుక్కున్న వాళ్లు మరియు గవర్నమెంట్ పట్టాలు ఇస్తే కట్టుకున్న పేదవాళ్లు ఉన్నారని, పేదవాళ్లకు ఎలాంటి అన్యాయం జరగకుండా న్యాయం చేయాలని కాలనీ వాసులతో వెళ్ళి కలెక్టర్ ను మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు మరియు మాజీ కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ-వేణు గార్లు కోరారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందించి ఇరిగేషన్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా అని అన్నారనితెలిపారు.