calender_icon.png 25 November, 2025 | 4:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

11-02-2025 12:04:15 AM

మేడ్చల్, ఫిబ్రవరి 10(విజయ క్రాంతి): ప్రజావాణి ఫిర్యాదులను వెంటనే పరిష్కరిం చాలని అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో లా ఆఫీసర్ చంద్రావతి తో కలిసి ప్రజావాణిలో ఫిర్యాదులు స్వీకరిం చారు. మొత్తం 57 ఫిర్యాదులు వచ్చాయి. వీటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేసి పరిష్కరించాలని సూచించారు. వీటిపై తీసుకున్న చర్యలను వివరిస్తూ ఆన్లైన్ పోర్టల్ లో అప్లోడ్ చేయాలని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పెండింగ్లో పెట్టవద్దన్నారు.