09-09-2025 12:13:27 AM
రాష్ట్ర పోలీసు హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్, ఐజి రమేష్ రెడ్డి
వనపర్తి, సెప్టెంబర్ 08 ( విజయక్రాంతి ) : పోలీస్ సంక్షేమ విభాగం నుంచి ఏర్పాటు చేస్తున్న పెట్రోల్ పంపు ప్రజల నమ్మకం మే రకు నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా అమ లు చేయడం జరుగుతుందని పోలీస్ ఐ.జి. రమేష్ ప్రజలకు భరోసా కల్పించారు.
సోమవారం వనపర్తి మండలం రాజపేట గ్రామ శివారులో వనపర్తి పోలీస్ శాఖ సౌజన్యంతో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర పోలీస్ హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ , ఐజి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, స్తా నిక శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి, జి ల్లా ఎస్పీ రావుల గిరిధర్ తో కలిసి పెట్రోల్ బంకు ను ప్రారంభోత్సవం చేసారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ...
ప్రజలకు పోలీసులపై విశ్వసనీయత పెరిగిందని అన్నా రు. వనపర్తి జిల్లాలో పోలీస్ విభాగం ద్వారా పెట్రోల్ బంకు ఏర్పాటుకు ప్రతిపాదనలు ఇస్తే జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి , స్తానిక శా సన సభ్యులు వేగంగా స్పందించి అనతి కా లంలోనే అన్ని అనుమతులు ఇవ్వడంతో షరవేగంగా కేవలం 4 నెలల వ్యవధిలో పె ట్రోల్ బంక్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.పోలీసు వ్యవస్థ పై ప్రజలకు మ రింత నమ్మకం పెరిగింది - వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘరెడ్డిపోలీసులు ప్రజల కు అండగా నిలబడి వారి సమస్యలను పరిష్కరిస్తారన్నారు.
పోలీస్ విభాగం పై ప్రజలకి మంచి నమ్మకం ఉండటంతో పట్టణ శివారులో పెట్రోల్ బంకు ఏర్పాటు చేయించ డం జరిగిందన్నారు.అలాగే రాబోవు రోజు ల్లో కొత్తకోట, వనపర్తి క్యారీడర్ ఏర్పాటు కో సం చేసిన ప్రతిపాదనలను ఆర్ అండ్ బి మంత్రికి ఇవ్వడం జరిగింది అన్నారు. దీంతోపాటుగా వనపర్తికి ఒక బైపాస్ రోడ్డు కూడా పెబ్బేరు కనెక్టింగ్ చేస్తూ ప్రతిపాదించడం జ రిగింది అన్నారు.
అది కూడా మంజూరు అ యిందని త్వరలోనే పనులు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఐ ఓ సి ఎల్ అధికారులు సుమిత్ర, శరణ్య, జిల్లా మార్కెట్ కమిటీ చై ర్మన్ శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీపీ కిచ్చారె డ్డి, డి.ఎస్.పి వెంకటేశ్వర్లు, సిఐలు, ఎస్త్స్రలు, తదితరులు పాల్గొన్నారు.