calender_icon.png 12 July, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫ్రైడే డ్రైడేతో ప్రజారోగ్యం!

12-07-2025 01:43:17 AM

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

రామాయంపేట, జూలై 11 : ఫ్రైడే-డ్రైడే కార్యక్రమం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడవచ్చని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో 7వ వార్డులో డిఎంహెచ్వో డాక్టర్ శ్రీరామ్,   మున్సిపల్ అధికారులతో కలిసి ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న పారిశుధ్య పరిస్థితులను మెరుగు పర్చడంతో పాటు, సీజనల్ వ్యాధులను కట్టడి చేసేందుకు, సమాంతరంగా తీసుకోవాల్సిన అత్యవసర చర్యలను పాటించేందుకు ప్రతి శుక్రవారం స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించటానికి చర్యలు చేపట్టామన్నారు.

యాంటీ లార్వా ఆపరేషన్, మురుగు కాల్వలు, మురుగునీటి నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వంటివి వేస్తున్నారని, దోమల నిర్మూలన కోసం ఫాగింగ్ చర్యలు చేపడుతున్నారని తెలిపారు. దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి శుక్రవారం డ్రై డే ఫ్రైడే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.