12-07-2025 01:42:59 AM
కొత్తపల్లి,జులై11(విజయక్రాంతి): విద్యార్థులకు పాఠశాల స్థాయి నుం డే నాయకత్వ లక్షణాల పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాలని, వా రికి నాయకత్వ లక్షణాలను అలవర్చుకునేందుకు అవకాశాన్ని కల్పిం చాల్సిన అవసరం ఎంతగానో ఉందని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి అన్నారు. స్థానిక వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ టైనీటాట్స్ ప్రాంగణంలో నిర్వహింపబడిన వివిధ విభాగాల క్యాప్టెన్స్ & వైస్ క్యాప్టెన్స్ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైనారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు నూతనోత్సాహం కలిగించడానికి వారికి ప్రజాస్వామ్యం పట్ల అవగాహన కల్పించడానికి సమాజంలో ఎదురవుతున్నటువంటి సమస్యలను పరిష్కరించే విధానాలను సైతం ప్రత్యక్షంగా విద్యార్థులకు పాఠశాల స్థాయిలో తెలియపరచడానికి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలను నిర్వహించడం జరిగిందని ఎన్నికలలో గెలుపొందిన విద్యార్థులకు పాఠశాలలో వేడుకగా ప్ర మాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని చెప్పారు.
ధ్రువ విభాగం కెప్టెన్, వైస్ కెప్టెన్ : వి అభిరుత్విక్, ఎం. సాయి రిశ్వంత్ లక్ష్యా విభాగం కెప్టెన్, వైస్ కెప్టెన్: టీ.సాకేత్ ,పి. శివభార్గవ్ సరస్ విభాగంకెప్టెన్, వైస్ కెప్టెన్: బి.శివ సాయి ఆదిత్య , ఏ కతీక తేజస్ విభాగం కె ప్టెన్ , వైస్ కెప్టెన్: ఆర్. రాహుల్ సుమయ్య సాదఫ్ లు ఎన్నికయ్యారు.వేడుకగా నిర్వహించినటువంటి ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించినటువంటి పలు సాంస్కృతిక కార్యక్రమాలుఆకర్షించాయి.