calender_icon.png 17 January, 2026 | 7:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మార్పీఎస్ క్రికెట్ టోర్నమెంట్‌కు ప్రజాప్రతినిధుల హాజరు

17-01-2026 03:22:26 AM

అశ్వాపురం, జనవరి 16, (విజయక్రాంతి): అశ్వాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతున్న ఎమ్మార్పీఎస్ 20వ క్రికెట్ టోర్నమెంట్కు శుక్రవారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఓరుగంటి భిక్షమయ్య, అమ్మగారిపల్లి సర్పంచ్ ఇరప కవిత, సీతారాంపురం సర్పంచ్ సప్కా పిచ్చయ్య ముఖ్య అతిథులుగా పాల్గొని, పాములపల్లి లెవెన్,

బిక్షం B లెవెల్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ను వారు వీక్షించారు. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో పాములపల్లి జట్టు విజయం సాధించగా, విజేత జట్టును అతిథులు అభినందించారు. ఈ సందర్భంగా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గుగులోత్ రమేష్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ క్రికెట్ క్రీడాకారులు, ఎమ్మార్పీఎస్ టోర్నమెంట్ నిర్వాహకులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.