06-08-2025 12:00:00 AM
మేడ్చల్, ఆగస్ట్ 05(విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలో సోమవారం రాత్రి జరిగిన పేలుడు ఘటనకు గ్యాస్ లీకే కారణమని తేలింది. గ్యాస్ లీకై ఇల్లంతా నిండిన సమయంలో స్విచ్ ఆన్ చేయడం వల్లే పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం లో రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్న ఒక వ్యక్తి మరణించిన విషయం విధితమే. అతని వివరాలు ఇంతవరకు తెలియ రాలే దు.
ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తిగా అ నుమానిస్తున్నారు. జన సంచారం లేని సమయంలో, అదే సమయంలో బోర్ వెల్ వాహనం రావడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిం ది. పేలుడు ఘటన సరిగ్గా రాత్రి 9.39 గంటలకు జరిగింది. ఆ సమయంలో ఆ ప్రాంతం లో చాలా దుకాణాలు బందు చేశారు. మిగ తా దుకాణాలు బందు చేస్తున్నారు. ప్రధాన మార్కెట్ కావడం వల్ల ఎప్పుడు జన సంచారం ఎక్కువగా ఉంటుంది.
రాత్రి కావ డం వల్ల జన సంచారం తగ్గిపోయింది. ఆరు ఏడు గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగి ఉంటే ప్రాణ నష్టం భారీగా జరిగేది. అంతేగాక పేలుడు సమయంలో ఇంటి ముందు నుంచి బోర్వెల్ వాహనం వెళ్ళింది. శకలాలు బోర్వెల్ వాహనానికి తగిలాయి. లేకుంటే రో డ్డు మీద వెళ్లే వారికి, ఎదురుగా దుకాణాల వద్ద ఉన్న వారికి తగిలేవి.
బోర్ వెల్ వాహ నం రక్షణ కవచంగా వచ్చిందని లేకుంటే పె ను ప్రమాదం జరిగేదని ఆ ప్రాంత వ్యాపారు లు ఊపిరి పీల్చుకున్నారు. కొన్ని శకలాలు ఎదురుగా ఉన్న మొబైల్ షాప్ ష ట్టర్ కు తగలడంతో లోపల అద్దం పగిలిపోయింది. దీనిని బట్టి పేలుడు ఎంత ధాటిగా ఉందో అర్థమవుతుంది.
కుప్పకూలిన భవనం
పేలుడు దాటికి భవనం కుప్ప కూలింది. ఆ సమయంలో లోపల ఇంట్లో తిరుపతమ్మ ఉన్నారు. ఆమె ఇంట్లోనే గ్యాస్ లీక్ అయిం ది. గాయాల పాలైన ఆమెను అరగంట త ర్వాత స్థానికులు బయటకు తీశారు. ముం దు భాగంలో ఒక షెటర్లో పూల దుకాణం బంద్ చేయగా, మొబైల్ షాప్ యజమాని దినేష్ బంద్ చేయడానికి సిద్ధమవుతుండగా, ఫోన్ రావడంతో మాట్లాడుతూ అందులోనే ఉన్నాడు.
ఈయనకు స్వల్ప గాయాలయ్యా యి. పక్కన స్టేషనరీ దుకాణం లో పని చేసే రఫిక్ ఇంటికి వెళ్లడానికి రోడ్డు మీదకు రాగా ఆయనకు గాయాలయ్యాయి. పురాతన ఇం టికి ముందు రెండు షీటర్లు, లోపల ఒక పో ర్షన్ ఉంది. ఈ నెల 10న ఈ భవనాన్ని కూ ల్చివేసి పునర్నిర్మానం చేయాలని యజమాని నిర్ణయించాడు. దుకాణదారులను ఖాళీ చేయాలని చెప్పగా, ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు.
ఇంతలోనే దుర్ఘటన జరిగింది. తనకు 9 లక్షల నష్టం జరిగిందని మొబైల్ షాప్ యజమాని దినేష్ తెలిపారు. పేలుడు సమయంలో భారీ శబ్దం వచ్చిందని అక్కడ వ్యాపారులు తెలిపారు. ఇద్దరు మహిళలు మొబైల్ షాప్ కు వెళ్దామని నిర్ణయిం చుకొని మళ్లీ వద్దామని వెళ్లిపోయారు. వారు కొంత దూరం వెళ్ళగానే భారీ శబ్దం తో భవనం కూలిపోయింది. దీంతో వారు వెనుకకు వచ్చి తాము ప్రమాదంలో చిక్కుకునేవారుమని, అదృష్టవశాత్తు బయటపడ్డా మని ఊపిరి పీల్చుకున్నారు.