calender_icon.png 18 December, 2025 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల కాన్ఫరెన్స్

18-12-2025 12:24:15 AM

శుక్ర,శనివారాల్లో రామోజీ సిటీలో నిర్వహణ

హైదరాబాద్, డిసెంబర్ 17 (విజయక్రాంతి): ఈనెల 19, 20వ తేదీల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ల జాతీయ సదస్సును నిర్వహిస్తున్నట్లు టీజీపీఎస్సీ తెలిపింది. ఈ కార్యక్రమాన్ని రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించనున్నట్లు బుధవారం పేర్కొంది. ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్లతోపాటు రాష్ట్రపతి ముర్ము, ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణ, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి, యూపీఎస్సీ చైర్మన్ అజయ్ కుమార్ హాజరుకానున్నట్లు తెలిపింది. సదస్సులో పారదర్శకంగా పరీక్షల నిర్వహణ, తలెత్తుతున్న న్యాయపరమైన చిక్కులు, సంస్కరణలు, అమలు చేయాల్సిన బెస్ట్ ప్రాక్టీసెస్ గురించి చర్చించనున్నట్లు తెలిపింది.